Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (2024)

Guppedantha Manasu 2023 february 02 Episode: ‘రిషి సార్ నేను రిషిధారగా ఒక్కటైపోవాలి’ అని రాసి.. ‘పంచభూతాల్లారా? మేము మళ్లీ ఎప్పటిలానే కలిసిపోవాలి.. రిషి తనంతట తానే నిజం తెలుసుకోవాలి’ అని దన్నం పెట్టుకుని.. ఆ పడవని నీటిలో వదులుతుంది. ఇక రిషి.. ‘నా ప్రపంచమే వసుధారగా ఉండేది.. నాకంటూ కోరికలేం లేవు..’ అనుకుంటూ.. ‘వసుధారా ఏం కోరుకుంటే అది జరగాలి’ అని మొక్కుకుని కోరిక రాసి పడవని నీటిలో వదలుతాడు. నీటిలో ఇద్దరూ పడవలు ఒక చోట కలుసుకున్నప్పుడు.. ఇటు వసు.. అటు రిషి.. మరో పడవని చూసి.. ఆశ్చర్యంగా ఎదురుగా ఉన్న వాళ్లని చూస్తారు. రిషికి, వసు... వసుకి రిషి కనిపించగానే ఆశ్చర్యంగా.. ఆవేదనగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఆ సీన్ చాలా ఆసక్తికరంగా ఎమోషనల్‌గా ఉంటుంది. అదే సీన్ కంటిన్యూ అయ్యింది నేటి కథనంలో. జగతీ మహేంద్రలు కూడా రిషి షాక్ అవ్వడం చూసి వసు ఉన్నవైపు చూస్తారు. ‘ఈ పొగరు ఇక్కడికి వచ్చిందేంటీ?’ అనుకుంటాడు రిషి. ‘రిషి సార్ కూడా పడవలు వదలడానికి వచ్చారా?’ అనుకుంటుంది వసు. ‘ఈ పొగరు ఏం రాసి ఉంటుంది?’ అనుకుంటాడు రిషి మనసులో. ‘రిషి సార్ ఏం కోరుకుని ఉంటారు?’ అనుకుంటూ రిషి నీటిలోంచి బయటికి వచ్చేసరికి.. వసు.. అటు తిరిగి.. రిషి ముందుకు వచ్చేస్తుంది.

ఇక పడవ ప్రయాణం ఎంత?

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (1)

‘సార్ మీరు ఇక్కడా?’ అంటుంది వసు. ‘ఏం రాకూడదా? ఈ చెరువు ఏమైనా నీదా?’ అంటాడు రిషి. ‘అంటే ఈ పడవలు..’ అని వసు నసుగుతుంటే.. ‘ఒకరు నాకు చెప్పారులే’ అంటాడు రిషి. ‘మరి ఆ చెప్పిన వాళ్లు రాలేదా సార్’ అంటుంది వసు. ‘ఆ చెప్పిన వాళ్లు ఇంకా చాలా చెప్పారు.. ఆ మాటలన్నీ మాటలుగా మిగిలిపోయాయి’ అంటాడు రిషి బాధగా. ఇక దూరం నుంచి చూస్తున్న చక్రపాణి.. ‘రిషి సార్ వచ్చారేంటీ? వద్దులే.. వాళ్లనే మాట్లాడుకోనీ.. ఇప్పుడు నేను వెళ్లడం మంచిది కాదు’ అనుకుంటాడు మనసులో. ‘సార్ ఈ పడవలు ఎంత దూరం ప్రయాణిస్తాయో కదా?’ అంటుంది వసు. ‘మనుషులే మనతో ప్రయాణం చేయట్లేదు.. ఇక పడవ ప్రయాణం ఎంత సేపు చెప్పు’ అంటాడు రిషి వెళ్లబోతూ.

ఇప్పుడూ రొమాన్సే..

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (2)

‘సార్ సార్ మెషిన్ ఎడ్యుకేషన్‌లో నాకో ఐడియా వచ్చింది..’ అంటుంది వసు. ‘కాలేజ్‌లో మాట్లాడుకుందామా ప్రాజెక్ట్ గురించి?’ అంటూ రిషి ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోతాడు రిషి. అయితే కాళ్లకి షూ లేకపోవడంతో.. ముళ్లు చూసుకోకుండా రిషి నడిచేస్తుంటే చూసి.. రిషి కంటే ముందే పరుగున వెళ్లిన వసు.. ఆ ముళ్లుని చేత్తో తీసి పారేస్తుంది. ‘సార్..’ అంటూ అరుస్తుంది ఆ నొప్పికి. ‘ఏం అయ్యింది చూసుకుని నడువు’ అంటాడు రిషి ఇంకో అడుగు ముందుకు వేస్తూ కాలు స్లిప్ అయ్యి పడబోతుంటే.. వసు పట్టుకుంటుంది. జాగ్రత్త సార్ అంటుంది. ఇక రిషి షూ వేసుకుని.. ‘పడవపైన వసుధారా ఏం రాసి ఉంటుంది?’ అనుకుంటాడు మనసులో. (జగతీ, మహేంద్రల ఎక్స్ ప్రెషన్స్ కూడా కోపంగా చూపించరు. వాళ్లు కూల్‌గా ఉంటారు ఏంటో)

వెళ్లి నిజం చెప్పేస్తానమ్మా..

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (3)

‘సార్ పడవ మీద ఏం రాసి ఉంటారు?’ అనుకుంటుంది వసు. ఇద్దరూ ఒకేసారి పడవలవైపు చూస్తారు. ‘ఎందుకు వెనక్కి చూశారు’ అంటుంది వసు. ఏం లేదు అన్న రిషి.. ‘నువ్వు ఎందుకు వెనక్కి చూశావ్’ అంటాడు. ‘ఏం లేదు’ అంటుంది వసు. ఇక బై చెప్పొచ్చుగా అని మనసులో అనుకున్న రిషి.. అయిష్టంగా షర్ట్ విదుపుకుని.. కారు దగ్గరకు వెళ్లిపోతాడు. ‘డాడ్ వెళ్దామా?’ అంటాడు రిషి. కారు ఎక్కుతుంటారు మహేంద్ర, జగతీలు. రిషి తిరిగి వసుని ఓ సారి చూసి కారు ఎక్కేస్తాడు. ఇంతలో చక్రపాణి పరుగున వసు దగ్గరకు వచ్చి.. ‘అమ్మా అంతా ఒకే చోట ఉన్నారు.. వెళ్లి నిజం చెప్పేస్తానమ్మా’ అంటాడు. ‘నాన్నా వద్దు చెప్పుకుంటే సంజాయిషీ అవుతుంది. తెలుసుకుంటే వాస్తవం అవుతుంది’ అంటుంది వసు. రిషి వాళ్ల కారు వెళ్లిపోతుంది.

దేవయాని వెటకారానికి బ్రేక్..

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (4)

ఇక దేవయాని.. ధరణీతో ‘వాళ్లు ఎక్కడికి వెళ్లారు ఇంత పొద్దున్నే? ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు’ అంటూ శివాలెత్తుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఫణేంద్ర.. ‘వస్తారులే దేవయాని. వాకింగ్ వెళ్లారేమో’ అంటూ సముదాయిస్తాడు. అయినా దేవయాని రెచ్చిపోతూనే ఉంటుంది. ఇంతలో కారు వచ్చి ఆగుతుంది. మహేంద్ర, జగతీ గుమ్మం దగ్గరకు రాగానే.. ‘ఆది దంపతులు ఉదయాన్నే..’ అంటూ ఏదో అనబోతుంటే.. వాళ్ల వెనుక రిషిని చూసి వెటకారం మాటలు ఆపేస్తుంది దేవయాని. ముగ్గురూ లోపలికి రావడం చూసి.. ‘ఎక్కడికి వెళ్లారు జగతీ? మహేంద్రా మాట్లాడరేంటీ?’ అంటుంది.

వసు మెసేజ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (5)

‘మనశ్శాంతిని వెతుక్కుంటూ అలా వెళ్లాం వదినగారు’ అంటాడు మహేంద్ర కాస్త వెటకారం నవ్వు నవ్వుతూ. దాంతో దేవయాని.. ‘ఆ వసుధారని కాలేజ్ నుంచి పంపించకుండా మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో అశాంతిని పెట్టుకుని తిరుగుతున్నారు’ అంటూ రెచ్చిపోతుంది. సరిగ్గా అప్పుడే.. వసు రిషికి మెసేజ్ చేస్తుంది. ‘సార్ మెషిన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఒక మీటింగ్ పెట్టండి ప్లీజ్’ అని వసు మెసేజ్ చూడగానే.. రిషి.. జగతీతో.. ‘మేడమ్.. మెషిన్ ఎడ్యుకేషన్ మీటింగ్ అనౌన్స్ చేయండి.. వసుధార చెప్పారు’ అంటూ మారు మాట్లాడకుండా కాలేజ్‌కి వెళ్లిపోతాడు రిషి. దేవయాని రగిలిపోతుంది. ఇక ఆ తర్వాత జగతీ, మహేంద్ర, ఫణేంద్ర కూడా కాలేజ్‌కి స్టార్ట్ అవుతారు.

చక్రపాణి తెగింపు..

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (6)

మరోవైపు చక్రపాణి.. తన ఫోన్‌లోకి వసు ఫోన్ నుంచి రిషి నంబర్ తీసుకుని.. ‘వసమ్మ.. నిజం చెప్పడానికి కాలయాపన చేస్తుంది. నేను రిషి సార్‌కి నిజం చెప్పేస్తాను’ అనుకుంటూ కాల్ ట్రై చేస్తాడు. రిషి కారు పక్కకు ఆపి.. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రిషి హలో హలో అంటూనే ఉంటాడు ఈ లోపు చక్రపాణి చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. ‘హలో రిషి సార్.. నేను వసుధారా వాళ్ల నాన్నని మాట్లాడుతున్నాను.. వసుధారకు పెళ్లి కాలేదు.. తనకు తనే తాళి కట్టుకుంది..’ అంటూ అరుస్తాడు చక్రపాణి. ‘హలో.. హలో.. నాకేం వినిపించలేదు.. ఇక్కడ ట్రాఫిక్‌లో ఉన్నానండి మళ్లొకసారి చెబుతారా?’ అంటాడు రిషి. ఇక దాంతో చక్రపాణి.. హలో హలో.. రిషీ సార్.. అంటూ ముందుకు లేచి అరుస్తూ ఉంటాడు.

మాట తీసుకున్న వసుధార

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (7)

ఇంతలో వసు పరుగున వచ్చి.. ‘నాన్నా ఏం చేస్తున్నారు’ అంటూ ఫోన్ లాక్కుని కట్ చేస్తుంది. ‘మీరు చెబితే సమాధానం అవుతుంది.. తను తెలుసుకుంటే నిజమవుతుంది. ప్రేమ అర్థం లాంటిది.. ఇది సున్నితమైన అంశం..’ అంటూ ఏదేదో మాట్లాడుతుంది. వెంటనే రిషి నుంచి ఆ నంబర్‌కి ఫోన్ రావడంతో.. ‘సారీ అండీ రాంగ్ నంబర్’ అంటూ మెసేజ్ చేస్తుంది. వెంటనే చక్రపాణితో.. ‘నాన్నా నా మీద ప్రేమతో మీరు ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది. ఇంక చేయొద్దు.. ఈ సారి చేస్తే నా మీద ఒట్టే’ అంటూ ఒట్టు పెట్టుకుంటుంది వసు. చక్రపాణి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. వసు చక్రపాణి దగ్గరున్న తన ఫోన్ కూడా తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది.

దేవయాని మరో కుట్ర..

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (8)

దేవయాని కూల్‌గా ఇంట్లో కూర్చుని.. రాజీవ్‌కి కాల్ ట్రై చేస్తుంది. మొదట స్విచ్ ఆఫ్ వస్తుంది. ‘ఈ రాజీవ్ ఫోన్ ఎక్కడ పెట్టి చచ్చాడో’ అనుకుంటూ మళ్లీ ట్రై చేస్తుంది. ఈ సారి ఫోన్ కలుస్తుంది. ‘ఆన్ చేసినట్లు ఉన్నాడు’ అనుకుంటూ సంబరపడుతుంది దేవయాని. ‘ఇలా ఫోన్ ఆన్ చేశానో లేదు.. అప్పుడే మేడమ్ జీ నుంచి కాల్’ అనుకుంటూ రాజీవ్ లిఫ్ట్ చేస్తాడు. ‘ఫోన్ ఎక్కడ పెట్టి చచ్చావ్.. అయినా కూల్‌గా తిరుగుతున్నావా? నిన్ను నమ్ముకుని వేస్ట్’ అంటూ మాటలు అనేస్తుంది దేవయాని. ‘హలో మేడమ్ జీ.. నేను పోలీసుల నుంచి తప్పించుని తిరిగడం కూడా చాలా ముఖ్యం కదా.. సరే ఇప్పుడు నేను చెయ్యాల్సిన పనేంటో చెప్పండి చేసి పెట్టేస్తా.. మంచి ఊపు మీద ఉన్నాను’ అంటాడు రాజీవ్.

రాజీవ్ రచ్చ..

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (9)

‘ఏం లేదు.. కాలేజ్‌లో మీటింగ్ జరుగుతుంది. అక్కడికి నువ్వు వెళ్లి వసుధారా పరువు తియ్యాలి.. అప్పుడు తర్వాత కథను నేను నడుపుతాను’ అంటుంది దేవయాని. ‘సరే మేడమ్.. నేను చూసుకుంటాను... సీన్ ఇచ్చారు కదా.. డైలాగ్స్.. స్క్రీన్ ప్లే.. అంతా నేను చూసుకుంటానులే’ అంటూ కూల్‌గా ఫోన్ పెట్టేస్తాడు రాజీవ్. వెంటనే కారు తీసుకుని కాలేజ్‌కి వెళ్తాడు. అప్పటికే కాన్ఫరెన్స్ హాల్‌లో జగతీ, మహేంద్ర, ఫణేంద్ర, మిగిలిన మెషిన్ ఎడ్యుకేషన్ సభ్యులు అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. వసు ఇంకా మీటింగ్‌లో మాట్లాడే అంశాల గురించి తన క్యాబిన్‌లోనే ఏదో రాసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాజీవ్ ఆ హాల్లోకి వచ్చేసి.. అందరికీ నమస్తే పెడతాడు. ‘నేను ఎవరినో తెలియదు కదా.. వసుధార భర్తని’ అంటూ కూల్‌గా అందరికీ తెలిసేలా చెబుతాడు. మరి ఏం రచ్చ జరగబోతుందో చూడాలి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star మా and disney+ hotstar)

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (10)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu ఫిబ్రవరి 02 ఎపిసోడ్: ‘సార్ మా వసుకి పెళ్లి కాలేదు.. తాళి తనే కట్టుకుంది’రిషికి కాల్ చేసిన చక్రపాణి! (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Sen. Ignacio Ratke

Last Updated:

Views: 6156

Rating: 4.6 / 5 (56 voted)

Reviews: 87% of readers found this page helpful

Author information

Name: Sen. Ignacio Ratke

Birthday: 1999-05-27

Address: Apt. 171 8116 Bailey Via, Roberthaven, GA 58289

Phone: +2585395768220

Job: Lead Liaison

Hobby: Lockpicking, LARPing, Lego building, Lapidary, Macrame, Book restoration, Bodybuilding

Introduction: My name is Sen. Ignacio Ratke, I am a adventurous, zealous, outstanding, agreeable, precious, excited, gifted person who loves writing and wants to share my knowledge and understanding with you.