Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (2024)

Guppedantha Manasu 2023 february 04 Episode: దేవయాని దెబ్బకు రాజీవ్ రెచ్చిపోయాడు. వసుని అల్లరి చేయడానికి కాలేజ్‌కి వచ్చేశాడు. దాంతో కాలేజ్‌లో పెద్ద గొడవే జరిగింది. ‘నా భార్యని నాతో పంపించండి’ అంటూ వసు చేయి పట్టుకుని రచ్చచేస్తున్న రాజీవ్‌ని.. రిషి ఆపుతాడు. ‘వెళ్లిపో వసుధార.. నా భార్య అంటున్నాడుగా’ అంటూ రిషి కూడా వసు మీద కోప్పడతాడు. ఇంతలో రిషి.. ‘నువ్వు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్‌కి’ అంటూ అనంతగిరి ఎస్‌ఐ ముందు రాజీవ్‌ని తోస్తాడు. బిత్తరపోతారు అంతా. ఆ ఎస్‌ఐ.. ‘ఏరా రాజీవ్ ఈ అమ్మాయి నీ భార్యా? తాళి కట్టలేదు కదరా?’ అంటూ అసలు నిజం బయటపెడతాడు. దాంతో అంతా షాక్. ఇటు జగతీ, అటు రిషీ అంతా షాక్ అయిపోతారు. ఇక రిషి వసు వెంట పడతాడు. ‘ఎవరిని మోసం చేస్తున్నావ్ వసుధారా? అసలు నీకు తాళి కట్టింది ఎవరు? రాజీవ్ కట్టాడని ఇంతకాలం అనుకున్నాను కానీ ఏది నిజం?’ అంటూ నిలదీస్తాడు. ‘మీ అంతట మీరే ఆ నిజం తెలుసుకోవాలి’ అంటూ వెళ్లిపోతుంది వసు కోపంగా. ఇక కాలేజ్‌లో జరిగిన రచ్చమొత్తం దేవయానికి కాల్ చేసి చెప్పేస్తుంది ఓ లెక్చరర్. మరోవైపు వసుని ఎప్పుడూ ఆడిపోసుకునే లెక్చరర్స్ మాటలు జగతీ, మహేంద్రలు విని బాధపడతారు. ‘వసుధార మొగుడు ఎవరు? రిషి సార్‌కి సంబంధం ఏంటీ?’ అంటూ తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటే.. అది విన్న జగతీ, మహేంద్రలు.. వసునే నిజం చెప్పమని నిలదియ్యాలని నిర్ణయించుకుంటారు.

చక్రపాణి చెబుతాడు..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (1)

‘నిజం చెప్పేదే అయితే ఇప్పటి దాకా ఎందుకు దాస్తుంది. ఎవరినో పెళ్లి చేసుకుంటే రిషిని ఎందుకు చిత్రవథ చేస్తుంది. పెళ్లి చేసుకుని అటే వెళ్లక కాలేజ్‌కి వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతుంది. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు.. వసు ఇంతలా మారిపోతుందని నేనైతే అనుకోలేదు’ అంటుంది జగతీ అనుమానంగా. ‘జగతీ.. ఆ రోజు వసుధార వాళ్ల నాన్న ఈ విషయం చెప్పడానికే ఇంటికి వచ్చి ఉంటాడేమో?’ అంటాడు మహేంద్ర. (అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వండమ్మా అన్న చక్రపాణి మాటలు గుర్తు చేసుకుంటుంది జగతి) నిజమే మహేంద్రా.. ఆయన్ని కలిస్తే మనకు కచ్చితంగా నిజం తెలుస్తుంది పదా వెళ్దాం అంటుంది మహేంద్ర.

జగతీ, మహేంద్రల రిక్వస్ట్..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (2)

ఇక చక్రపాణిని కలవడానికి వసు ఇంటికి వెళ్లిపోతారు జగతీ, మహేంద్రలు. ‘చక్రపాణీ గారు’ అంటాడు మహేంద్ర. ‘నమస్తే సార్.. నమస్తే టీచరమ్మా..’ అంటాడు చక్రపాణి. ‘మీతో మాట్లాడాలి సార్.. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారు కదా.. ఎందుకు వచ్చారో చెబుతారా?’ అంటాడు మహేంద్ర. కూర్చోండి సార్ కూర్చోండి మేడమ్.. అంటూనే వసు నిజం చెప్పొద్దని తన మీద ఒట్టు వేయించుకున్న విషయం గుర్తు చేసుకుంటాడు. ‘చక్రపాణి గారు కాలేజ్‌కి రాజీవ్ వచ్చాడు.. పెద్ద గొడవ చేశాడు.. పోలీసులు అతడ్ని పట్టుకుని తీసుకుని వెళ్లారు.. అసలు ఏం జరిగింది. వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టకపోతే ఇంకెవరు కట్టారు?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు జగతీ మహేంద్రలు.

నేను చెబుతాను అన్న వసు..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (3)

ఇక చక్రపాణీ.. ‘మేడమ్ అది’ అంటూ నసుగుతాడు. ఇంతలో నేను చెబుతాను అంటూ లోపల నుంచి ఎంట్రీ ఇస్తుంది వసు. వసు వాళ్ల దగ్గరకు వస్తుంది. ‘అమ్మా అది జరిగింది’ అంటూ చక్రపాణి నసుగుతుంటే.. ‘నేను చెబుతాను నాన్నా’ అంటూ చెప్పడం మొదలుపెడుతుంది. ‘నాన్నతో రిషి సార్ విషయం చెప్పాను.. నాన్న అప్పుడు వద్దు అన్నారు’ అంటుంది వసు. ‘అప్పుడు నా కళ్లు అహంకారంతో మూసుకుపోయాయమ్మా..’ అంటాడు చక్రపాణి. ‘నాన్నా ప్లీజ్ మీరు మాట్లాడకండి’ అంటుంది వసు. ‘నాన్న రాజీవ్ బావతో పెళ్లి ఏర్పాట్లు హడావుడిగా చేశారు.. నన్ను రూమ్‌లో పెట్టి బంధించారు.’ అంటుంది వసు. జరిగింది గుర్తు చేసుకుంటాడు చక్రపాణి.

మరి ఏం జరిగింది వసు?

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (4)

వసు చెబుతూనే ఉంది. ‘సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేదు.. రాజీవ్ గన్ తెచ్చి నన్ను బెదిరించాడు. రిషి సార్‌ని, జగతీ మేడమ్‌ని మహేంద్ర సార్‌ని.. అమ్మనాన్నల్ని చంపేస్తా అన్నాడు.. ఒకవైపు నాన్న గొడవ.. మరోవైపు రాజీవ్ బావ బెదిరింపులు.. మిమ్మల్ని అందరినీ చంపుతానని బెదిరించాడు నేను భయపడతానని అనుకున్నాడు’ అంటుంది వసు. ‘మరి ఏం జరిగింది వసు?’ అంటుంది జగతీ కంగారుగా. వెంటనే వసు మెడలోంచి తాళి తీస్తుంది. ‘ఇది ఏంటి మేడమ్? ఇది ఎవరు ఇచ్చారు?’ అంటుంది వసు. దాంతో జగతీకి తనే ఇచ్చిన విషయం గుర్తొస్తుంది.

ఏంటి నువ్వు చెప్పేది?

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (5)

‘దీన్ని(తాళి) మీరు రిషి సార్‌తో పంపిచారు కదా?’ అంటుంది వసు. ‘అవును కానీ అది కాదు ముఖ్యం.. అది నీ మెడలో ఎవరు కట్టారు అన్నదే కావాలి..’ అంటుంది జగతి. ‘ఇంకెవరు కడతారు మేడమ్.. రిషి సారే..’ అంటుంది వసు. అర్థం కానట్లుగా జగతీ మహేంద్రలు ఒకరిని ఒకరు చూసుకుంటారు. ‘వాట్ రిషి కట్టాడా?’ అంటాడు మహేంద్ర. ‘ఏంటి వసు? ఏంటి నువ్వు చెప్పేది?’ అంటుంది జగతీ కంగారుగా. ‘ఇది రిషి సారే కట్టారు.. అప్పుడున్న పరిస్థితుల్లో నేను భయపడలేదు.. నన్ను నేను రక్షించుకోవాలనుకున్నాను..’ అంటుంది వసు. జగతీ, మహేంద్రలకు ఏం అర్థం కాదు. అయోమయంగా చూస్తుంటారు.

సరైన మార్గం అనిపించింది..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (6)

వసు మాట్లాడుతూనే ఉంది. ‘నా వాళ్లని నా ప్రేమని.. ఒక నిర్ణయానికి వచ్చాడు.. అప్పుడే ఈ తాళి నా మెడలో నా ఇష్టప్రకారం పడింది.. నా చేతులతో నేనే దీన్ని నా మెడలో వేసుకున్నాను. కానీ మానసికంగా ఇది రిషే నా మెడలో వేసినట్లుగా భావిస్తున్నాను.. రిషి సార్‌కి తెలియకుండానే సార్ దీన్ని నా మెడలో వేశారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను.. అప్పుడున్న పరిస్థితుల్లో రాజీవ్ బావ నుంచి తప్పించుకోవడానికి ఇదే సరైన మార్గం అనిపించింది’ అంటుంది వసు. జగతీ, మహేంద్రలు ఒకరిని ఒకరు చూసుకుంటారు ఆశ్చర్యంగా.

తానే నిజం తెలుసుకోవాలి..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (7)

ఆ తర్వాత దురదృష్టవశాత్తు అమ్మకు నాన్నకు అలా జరిగింది.. వాళ్లు ఆసుపత్రికి వెళ్తే.. నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది.. తర్వాత వేగంగా పరిస్థితులు.. అందరి ఆలోచనలు మారిపోయాయి.. పోలీస్ స్టేషన్‌లో నా మెడలో తాళి గురించి అందరి ముందు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.. అపార్థాలు చోటు చేసుకున్నాయి’ అంటుంది వసు ఏడుస్తూ. ‘మరి ఇప్పటికైనా రిషికి నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా వసు? అంటుంది జగతీ ఆవేదనగా.. రిషి అన్న మాటలు గుర్తు చేసుకున్న వసు.. ‘లేదు మేడమ్ రిషి సార్ తనంతట తానే నిజం తెలుసుకోవాలి’ అంటుంది వసు.

నో అన్న వసు..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (8)

‘ఇదిగో ఎందుకు వసుధార ఈ సమస్యని ఇంకా పెద్దది చేసుకుంటున్నావెందుకు?’ అంటాడు మహేంద్ర టెన్షన్‌గా. ‘ఇది సమస్య కాదు సార్.. మా ఇద్దరి జీవితాలు మా ఇద్దరి ప్రేమ.. రిషి సార్ మనసులో ఏదో దాగుంది.. తనంతట తానే తొలగించుకోవాలి’ అంటుంది వసు. ‘అది కాదమ్మా నా మాట విను..రిషి సార్‌కి నిజం చెప్పెయమ్మా.. పోనీ మమ్మల్ని’ అంటూ చక్రపాణీ మాటలు పూర్తి కాకుండానే.. ‘నాన్నా మా ఇద్దరి మధ్యలోకి మరో వ్యక్తి రాకపోతేనే బాగుంటుంది.. క్షమించండి నాన్నా.. మీ మీద నాకు గౌరవం ఉంది.. రిషి సార్‌కి నాకు మధ్య ఇంకొకరి సంప్రదింపులు రావద్దని నిర్ణయించుకున్నాను’ అంటుంది వసు.

జగతి ఆవేదన..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (9)

‘ఇలా అయితే ఎలా చెప్పు.. ఇక్కడ నువ్వు అక్కడ రిషి బాధపడటం అవసరమా? ఎందుకు ఇదంతా?’ అంటుంది జగతి ఆవేదనగా. ‘ఇది నా ప్రేమకు నాకు నేనుగా విధించుకున్న శిక్ష మేడమ్.. రిషి సార్ ఈ విషయంలో అపార్థం చేసుకున్నారు.. రిషి సార్ అపార్థం చేసుకున్నాను.. ఆ అపార్థాన్ని రిషి సార్ తనంతట తానే నిజం తెలుసుకోవాలి.. తప్పో ఒప్పో జరిగింది. కానీ మా ప్రేమని రిషి సారే గెలిపిస్తారు.. గెలిపించాలి కూడా’ అంటుంది వసు. ‘టైమ్ పడుతుంది కదా వసు..’ అంటుంది జగతీ.

ఒక్కటైన గురుశిష్యులు..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (10)

‘పట్టనివ్వండి మేడమ్.. పట్టనివ్వండి.. ఒక చిన్న విత్తనం భూమిలో నాటితేనే భూమిని చీల్చుకుని మొలకెత్తడానికి టైమ్ పడుతుంది. బంగారానికి సైతం మెరుగులు దిద్దడానికి అగ్నిలో కాలుస్తారు.. ఇప్పుడు మా ప్రేమకు నేనే అగ్ని పరీక్ష పెట్టుకున్నాను మేడమ్.. ఈ పరీక్షలో రిషి సారే గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది’ అంటుంది వసు. వెంటనే జగతీ వసుని హత్తుకుని ‘ఐ యామ్ సారీ’ అంటుంది తలనిమురుతూ. ‘వసు నా కొడుకు మీదున్న ప్రేమతో ఇంత దూరం ఆలోచించలేకపోయాను నేను’ అంటుంది జగతీ ఆవేదనగా. ‘అవును వసుధారా.. నువ్వేంటి ఇలా చేశావ్ అనుకున్నాను’ అంటాడు మహేంద్ర.

మాట తీసుకున్న వసు..

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (11)

‘ఇది స్త్రీ తత్వానికి.. నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.. రిషి సార్ లేకపోతే నేను బతకలేనని నేను ఎలా తెలుసుకున్నానో.. రిషి సార్ కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటారు.. ఈ వసుధార ఆఖరి శ్వాస వరకూ కూడా రిషి సార్ కోసమే జీవిస్తుందని రిషి సార్ తెలుసుకోవాలి.. నా మెడలో వేరే ఎవరో తాళికట్టారని తను ఎలా అనుకుంటారు? నిజం తెలుసుకోవాలి మేడమ్.. దయచేసి మీరు ఈ విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు.. ఈ విషయంలో దూకుడుగా ఆలోచించి రిషి సార్‌కి నిజం చెప్పొద్దు.. చెబితే మా ప్రేమ మీద ఒట్టే’ అంటూ జగతీ చేతిని తన తల మీద పెట్టించేసుకుంటుంది. దాంతో జగతి, మహేంద్రలు నిస్సహాయులుగా మిగిలిపోయారు. తర్వాత ఏం జరిగిందో ఈ కింది లింక్‌లో చూడండి.

Read Also: ‘గుప్పెడంత మనసు’: రాజీవ్ వెనుక దేవయాని ఉందని కనిపెట్టేసిన జగతి.. ఒకే ఇంట్లో రిషిధార! ఇక నుంచి కథ వేరే లెవల్

Read Also: అభి-అంకిత విడాకులు..కాపురం ముక్కలు.. ఒక్క మాటతో కుప్పకూలిన తులసి

Read Also: సామ్రాట్ వచ్చేశాడు.. నీ మాజీ మొగుడికి సాయం చేసి చరిత్రలో నిలిచిపోతా తులసీ

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (12)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu ఫిబ్రవరి 04 ఎపిసోడ్: వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్.. ఒక్కటైన గురుశిష్యులు.. (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Otha Schamberger

Last Updated:

Views: 6154

Rating: 4.4 / 5 (55 voted)

Reviews: 86% of readers found this page helpful

Author information

Name: Otha Schamberger

Birthday: 1999-08-15

Address: Suite 490 606 Hammes Ferry, Carterhaven, IL 62290

Phone: +8557035444877

Job: Forward IT Agent

Hobby: Fishing, Flying, Jewelry making, Digital arts, Sand art, Parkour, tabletop games

Introduction: My name is Otha Schamberger, I am a vast, good, healthy, cheerful, energetic, gorgeous, magnificent person who loves writing and wants to share my knowledge and understanding with you.