Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (2024)

Guppedantha Manasu 2023 february 10 Episode: గత ఎపిసోడ్‌లో రిషి, వసుల టూర్ ఆసక్తికరంగా సాగింది. కావాలనే వసు.. రిషిని భర్తను పిలిచినట్లు.. ఇదిగో పెన్విటీ.. ఏమయ్యా.. అంటూ ఆటపట్టించడం.. రిషి మనసులో కోటి వీణలు మోగడం తెలిసిందే. మరోవైపు తిరుగు ప్రయాణంలో మాట్లాడితే ఏం తిడతాడోనన్న భయంతో.. వసు దొంగ నిద్ర నటిస్తుంటే.. నిజంగానే నిద్రపోతుందని కుళ్లుకున్న రిషి.. కావాలనే కుదుపుల్లో కారు డ్రైవ్ చేసి.. నిద్రలేచేలా చేయడం.. ఇలా సాగుతూనే ఉంది. పైగా వాళ్లకు భోజనం పెట్టిన ధర్మయ్య.. అతడి భార్య.. ఇద్దరినీ భార్యభర్త అనుకుని గౌరవంగా మాట్లాడటం.. వచ్చే ఏడాది పాపతోనో బాబుతోనో మా ఇంటికి రావాలని వాళ్లు చెప్పడం.. ఇలా అంతా రసవత్తరంగా సాగింది. పైగా టూర్ పూర్తి చేసుకుని దగ్గరకు వచ్చేసరికి మినిస్టర్ కాల్ చేసి.. ‘వీలైతే ఒకసారి ఇటు వచ్చి వెళ్లండి’ అనడంతో వసు, రిషీలు అక్కడికి వెళ్తారు. అక్కడ మినిస్టర్ వసు మెడలో తాళి చూసి పెళ్లి అయ్యిందని అర్థం చేసుకుని.. తన పీఏతో చీర తెప్పించి.. వసుకి గిఫ్ట్‌గా ఇవ్వబోతూ.. రిషిని కూడా తన పక్కనే ఉండమని ఆహ్వానిస్తాడు. ఇద్దరూ కలిసే ఆ చీరని వసుకి అందిస్తారు.

తప్పకుండా సార్..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (1)

అవును వసుధారా మీ వారు ఏం చేస్తుంటారు?’ అన్న మినిస్టర్ ప్రశ్న రిషికి బాగా నచ్చేస్తుంది. ‘చెప్పు ఇప్పుడు సమాధానం’ అన్నట్లుగా ఆత్రంగా వసువైపు చూస్తాడు రిషి. వెంటనే వసు నవ్వుతూ.. ‘తను ఆల్ రౌండర్ సార్.. చాలా గొప్ప వ్యక్తి సార్’అంటుంది సిగ్గుపడుతూ. ‘అవునా గుడ్.. ఒకసారి మీరిద్దరూ కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి’ అని మినిస్టర్ అనడంతో.. ‘తప్పకుండా సార్.. రిషి సార్‌ని కూడా తీసుకుని వస్తాను’ అంటుంది వసు. మధ్యలో నేనెందుకు అన్నట్లుగా చూస్తాడు రిషి. ‘సరే అమ్మా.. అవునమ్మా రిషి సార్‌కి మీ వారిని పరిచయం చేశావా మరి?’ అంటాడు మినిస్టర్.

తను దొరకడం నా అదృష్టం..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (2)

‘లేదు సార్.. త్వరలోనే పరిచయం చేస్తాను’ అంటుంది వసు నవ్వుతూ. ‘హా.. తనకు ఇట్రెస్ట్ ఉంటే మీ కాలేజ్‌లోనే పని చేయమని చెప్పు.. ఇద్దరూ కలిసి రిషి సార్ కళ్ల ముందుంటారు’ అంటాడు మినిస్టర్ నవ్వుతూ. రిషి ఉడుక్కుంటాడు బాగా. దాంతో వసు కావాలనే రిషిని చూసి నవ్వుతూ.. ‘అవును సార్.. ఈ ఆలోచన కూడా బాగుంది’ అంటుంది. ‘చూడమ్మా.. నీలాంటి అమ్మాయిని భార్యగా పొందిన ఆ అదృష్టవంతుడెవరో నాకు చూడాలని ఉందమ్మా..’ అంటాడు మినిస్టర్. ‘హా.. సరిగ్గా రిషి సార్ కూడా ఇంచుమించు ఇలాగే అన్నారు సార్.. కానీ తను దొరకడం నా అదృష్టం..’ అంటుంది వసు కావాలనే రిషిని చూస్తూ.

ఈ చీర ఒకసారి పట్టుకుంటారా?

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (3)

‘అమ్మ పొగరు.. ఇంత ఉత్సాహంగా ఎలా మాట్లాడుతుంది.. అసలు ఏం జరగనట్లు?’ అనుకుంటాడు రిషి మనసులో. ‘వసుధారా వెళ్దామా? మినిస్టర్‌గారికి చాలా పనులు ఉంటాయి..’ అంటాడు కావాలనే. ‘సరే సార్ వెళ్లొస్తాం’ అంటూ ఇద్దరూ బయలుదేరతాడు. అప్పుడే వసు.. ‘సార్ ఈ చీర ఒకసారి పట్టుకుంటారా? అంటే.. నాకు బ్యాగ్ ఉంది’ అంటుంది వసు. ఇక రిషి గుర్రుగా ఓ చూపు చూసి.. హలో హా వస్తున్నాను అంటూ ఫోన్ రాకుండానే వచ్చినట్లు మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు. దాంతో వసు చేసేదేం లేక.. ఒక చేత్తో ఆ చీర.. మరో చేత్తో బ్యాగ్ పట్టుకుని బయలుదేరుతుంది.

జగతీ, మహేంద్రల టెన్షన్..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (4)

మరోవైపు జగతీ, మహేంద్రలు తమ గదిలోనే అటు ఇటు ఒకరికి ఎదురుగా ఒకరు తిరుగుతూ ఉంటారు. ‘ఫోన్ చేయొచ్చుగా రిషీ’ అంటూ జగతీ.. ‘ఫోన్ చేయొచ్చుగా వసుధారా’ అంటూ మహేంద్ర.. ‘కొంచెమైనా రిషి టెన్షన్ ఫ్రీ అయ్యాడా?’ అని జగతీ.. ‘లేక ఇంకా టెన్షన్ పెరిగిందా?’ అని మహేంద్ర.. మాట్లాడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ‘ఫోన్ చేద్దాం’ అంటాడు మహేంద్ర. వద్దు వెయిట్ చేద్దాం అంటుంది జగతీ. ఇక రిషి కారు తిరిగి బయలుదేరుతుంది. వసు.. రిషి పక్క సీట్‌లో కూర్చుని.. మినిస్టర్ ఇచ్చిన చీరని కప్పుకుని.. సెల్ఫీలు దిగుతుంది. రిషికి ఇంకా కాలిపోతుంది.

వసు సెల్ఫీ గోల

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (5)

‘సార్ చీర బాగుంది కదా? థాంక్యూ సార్.. ఈ చీరను మీ చేతుల మీదుగా నాకు ఇచ్చినందుకు’ అంటుంది వసు. రిషికి మనసులో చాలా బాధ కలుగుతుంది. అదేం పట్టించుకోని వసు.. కూల్‌గా.. ఫోన్ అటువైపు తిప్పి.. రిషిని కూడా తనతో పాటు సెల్ఫీలు తీస్తుంది. ‘సార్ చూడండి.. నవ్వండి.. ఇందులో మీ స్మైల్ మిస్ అయ్యింది’ అంటూ రిషికి బాగా ఇబ్బందిని కలిగిస్తుంది. రిషికి చాలా రగిలిపోతుంది. వెంటనే సడన్ బ్రేక్ వేస్తాడు కోపంగా. కారు దిగిపోతాడు. వసు కూడా దిగుతుంది. రిషి వైపు నడిచి వస్తుంది. రిషి మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు.

ఎవరు అతను..?

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (6)

‘ఏం అనుకుంటున్నావ్ నువ్వు?’ అంటాడు రిషి కోపంగా. ‘ఏ విషయం సార్’ అంటుంది వసు. ‘ఇంకా అర్థం కానట్లు నటించకు వసుధారా.. ఆ తాళి నీ మెడలో నీ ఇష్టప్రకారమే పడింది అన్నావ్ కదా?’ అంటూ అరుస్తాడు రిషి. ‘అవును సార్ అన్నాను.. ఇప్పుడు అదే అంటున్నాను’ అంటుంది వసు కూల్‌గా. ‘ఎవరు అతను.. ఎవరిని పెళ్లి చేసుకున్నావ్.. అసలు ఏంటి నీ ఉద్దేశం.. మన బంధమేమైంది. ఆ మాటలు ఏమయ్యాయి? రిషి సార్ లేకపోతే వసుధార బతకదు అన్నావ్? ఏంటి ఇవన్నీ? హా?’ అంటూ ఆవేశంగా అరుస్తాడు రిషి. వసు వింటూనే కోపంగా చూస్తూ ఉంటుంది.

వసు మౌనం..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (7)

‘మీ ఊరు వెళ్లేవరకూ బాగానే ఉన్నావ్.. ఇంటికి వెళ్లాక మనిషివే మారిపోయావ్’ అంటాడు రిషి. ‘నేనేం మారలేదు సార్’ అంటుంది వసు. ‘మాట్లాడకు వసుధారా.. ఇంకేం మాట్లాడకు.. ఇంతకాలం నా కోపాన్ని అణచివేశాను.. కోపమో బాధో.. ఏంటో అసలు ఏంటో నాకే తెలియట్లేదు.. నా జీవితంతో నువ్వు ఆడుకోవాలనుకుంటున్నావా? నీ ఇంటికి వస్తే వెళ్లమన్నావ్.. పర్సనల్ అన్నావ్.. పోలీస్ స్టేషన్‌కి వస్తే తాళిబొట్టు ఉంది.. అదేంటని అడిగితే ఏదేదో చెప్పి నా నోరు మూయించావ్..’ అంటాడు రిషి ఆవేశంగా. వసు మాత్రం అలానే నిలబడి.. కోపంగా చూస్తుంది.

ఎన్నాళ్లు దాస్తావ్?

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (8)

‘వాడొచ్చి.. ఆ రాజీవ్ గాడు వచ్చి నా పెళ్లాం అంటాడు.. తీరా చూస్తే వాడి తాళి కట్టలేదని ఎస్‌ఐ గారు అనే వరకూ అసలు నిజమేంటో నాకు తెలయదు.. అది నిజం కాకపోతే నిజం ఏంటి వసుధారా’ అంటూ అరుస్తాడు రిషి చాలా కోపంగా. వసు మౌనంగానే ఉంటుంది. ‘చెప్పు వసుధారా నిజమేంటీ?’ అంటాడు మరోసారి ఆవేశంగా. ‘నిజమే నిజంగా నిజం సార్’ అంటుంది వసు. వసుధార సమాధానం వింటే ప్రేక్షకులకే కోపం వస్తుంది. రిషికి కోపం రావడంలో అర్థముంది మరి. ‘అంటే అంటే ఏంటీ? నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు? ఎన్నాళ్లు దాస్తావ్? నువ్వు అబద్దమా? నీ ప్రేమ అబద్దమా? నీ మాటలన్నీ అబద్దమా? అసలు ఏది నిజం? ఏది అబద్దం?’ అంటూ రెచ్చిపోతాడు రిషి.

ఇక నా వల్ల కాదు..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (9)

‘ఏంటి సార్ మీరు గట్టిగా అరిచి.. నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?’ అంటుంది వసు. ‘వసుధారా నేను భయపట్టడం ఏంటీ? అడుగుతున్నాను.. చెప్పు ఎవడు వాడు?’ అంటాడు రిషి కోపంగా. దాంతో వసు మేడమ్ గారు కోపంగా వేలు చూపిస్తూ ‘సార్ మర్యాదగా మాట్లాడండి’ అంటుంది. ‘మర్యాద ఇచ్చేంత వరకూ ఇచ్చాను.. ఇక నా వల్ల కాదు.. నీ మెడలో తాళి కట్టింది ఎవడూ?’ అని అరుస్తాడు రిషి. ‘సార్ మళ్లీ చెబుతున్నాను ఆ తాళికి సంబంధించిన ఆ వ్యక్తి గురించి అగౌరవంగా మాట్లాడకండి’ అంటుంది వసు వితండవాదిలా.

కథ మొత్తం మార్చేశావ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (10)

‘మాట్లాడతాను వసుధారా నేను మాట్లాడతాను.. వందసార్లు మాట్లాడతాను.. నీ ఇష్టానికి నువ్వు చెబుతుంటే.. నేను భయపడతాను అనుకుంటున్నావా? ఇష్టంగా ఉన్నావ్.. ఐ లవ్యూ చెబితే అప్పుడు నో చెప్పావ్.. కారణం ఏంటో చెప్పలేదు.. మళ్లీ నన్ను బాధపెట్టిన నువ్వే ఐలవ్యూ అన్నావ్.. పోనీలో నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి.. లైఫ్ జర్నీ కదా.. ఆలోచించుకుంటుందేమో అనుకున్నాను.. నేను మా ఇంట్లో అందరి ముందు చెప్పాను.. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని.. నువ్వు విన్నావ్.. తీరా మీ ఊరు వెళ్లి కథ మొత్తం మార్చేశావ్’ అంటాడు రిషి కోపంగా.

ఇదంతా నీ ప్లానా?

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (11)

‘ఇప్పుడు ఏం అంటారు సార్?’ అంటుంది వసు. ‘నా పర్సనల్ లైఫ్‌లోకి నువ్వు ఎందుకొచ్చావ్? ఎవరు రమ్మన్నారు? చెప్పు.. ఎవరు రమ్మన్నారు. నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు నో చెప్పి అలాగే ఉండిపోతే అయిపోయేది కదా? ఎందుకు ఇలా బాధపెడుతున్నావ్.. ఏం ఇదంతా నీ ప్లానా?’ అనేస్తాడు రిషి కోపంలో. వసు గుండె ముక్కలైపోతుంది. ‘ప్లాన్‌లు వేయడం నాకు ఎప్పుడూ తెలియదు సార్’ అంటుంది వసు. ‘మరి దీన్నేమంటారు? ఎందుకు ఇలా రంగులు మారుస్తున్నావ్.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్? ఎందుకు ఇలా జీవితాలను తలకిందులు చేస్తున్నావ్?’ అంటూ అరుస్తాడు రిషి.

నువ్వే మాట్లాడిస్తున్నావ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (12)

‘నేను రంగులు మార్చానా? అంటే.. నన్ను మార్చే ఊసలవెల్లి అన్నట్లే కదా? ఏంటి సార్ మీరు ఇలా కూడా మాట్లాడతారా?’ అంటుంది వసు కళ్లనిండా నీళ్లతో. ‘నువ్వే మాట్లాడిస్తున్నావ్.. అవును నువ్వే మాట్లాడిస్తున్నావ్.. ఆ తాళి నీ మెడలో కట్టినవాడు ఎవడు.. నాకు చెప్పాలి వసుధారా.. నాకు చెప్పాలంతే.. చెప్పి తీరాలి వసుధారా ఇప్పుడు’ అంటాడు రిషి కోపంగా. ‘నేను చెప్పను సార్.. నేను చెప్పను.. నేను చెప్పను సార్.. నన్ను ఎన్ని మాటలు అన్నారు.. రంగులు మారుస్తున్నానా? జీవితాన్ని నాశనం చేస్తున్నానా? నా గురించి ఇన్ని తెలుసుకున్న వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోండి మరి’ అంటుంది వసు.

వసు వార్నింగ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (13)

‘అంటే.. నువ్వు చెప్పవా?’ అంటాడు రిషి. ‘చెప్పను సార్.. మీరే తెలుసుకోండి.. ఇక నన్ను అడగకండి.. ప్రేమగా అడిగితే చెప్పేదాన్ని.. ఇంకా ఘోరంగా మాట్లాడారు.. నేను అస్సలు చెప్పను..’ అనేసి తన బ్యాగ్, చీర కారు లోంచి తీసుకుని.. వెళ్లిపోబోతూ ఆగి రిషివైపు చూసి.. ‘ఒక్క మాట గుర్తు పెట్టుకోండి రిషి సార్.. నా మెడలో తాళి కట్టింది ఎవడో అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు కదా? ఈ మాటలు నా మెడలో తాళి పడటానికి కారణమైన వ్యక్తికి తెలిస్తే మాత్రం ఊరుకోడు చెబుతున్నాను’ అని ఛాలెంజింగ్‌గా మాట్లాడేసి ముందుకు నడిచేస్తుంది. ఒక ఆటో ఆపి.. ఎక్కి వెళ్లిపోతుంది.

జగతీ అన్నదే నిజం.. టన్నుల కొద్దీ ఇగో

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (14)

ఇక రిషి కిందున్న నేలని ఆవేశంగా తన్నుతూ.. ‘ఛా నేను తొందర పడ్డానా? నోరు జారానా? అలా మాట్లాడకుండా ఉండాల్సిందా? నేనేం తప్పు మాట్లాడాను? అరే ఇంత బంధాన్ని కాదు అని తాళి ఎలా కట్టించుకుంటావ్? ఎవడు వాడు అన్నాను.. అది తప్పా? నా బాధా.. నా జీవితం ఇదంతా తనకు పట్టదా?’ అని రగిలిపోతాడు రిషి. ఇక మహేంద్ర, జగతీలు ఇంట్లో కాఫీ తాగుతూ.. ‘ఏం జరిగి ఉంటుంది?’ అని ఆలోచించుకుంటూ ఉంటారు. ‘ఏం జరిగిందో ఊహించి చూద్దామా?’ అంటాడు కొంటెగా నవ్వుతూ. ‘వద్దు మహేంద్ర.. ఇద్దరూ ఈ మధ్య ఊహకు అందటం లేదు మహేంద్ర.. పైగా ఇద్దరికీ టన్నుల కొద్ది ఇగో’ అంటుంది జగతీ. మొత్తానికీ జగతీ మాట నిజమే. ఇద్దరికీ ఇగోనే. అందుకే ఎవ్వరూ తగ్గడం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (15)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రఫ్ఫాడించేసిన రిషీంద్రభూషణ్.. ‘చెప్పు ఎవడాడు? ఎవడితో తాళికట్టించుకున్నావ్..?’ (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Domingo Moore

Last Updated:

Views: 6150

Rating: 4.2 / 5 (53 voted)

Reviews: 84% of readers found this page helpful

Author information

Name: Domingo Moore

Birthday: 1997-05-20

Address: 6485 Kohler Route, Antonioton, VT 77375-0299

Phone: +3213869077934

Job: Sales Analyst

Hobby: Kayaking, Roller skating, Cabaret, Rugby, Homebrewing, Creative writing, amateur radio

Introduction: My name is Domingo Moore, I am a attractive, gorgeous, funny, jolly, spotless, nice, fantastic person who loves writing and wants to share my knowledge and understanding with you.